హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవాలంటే ఈ రోజే ఆఖరిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. బుధవారం సైతం భక్తులు అధిక సంఖ్యలో ఖైరతాబాద్ చేరుకుని గణనాథుడిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా క్యూలైన్లో తోపులాట జరిగింది. వీఐపీలు వస్తున్న సమయంలో క్యూలో నిలుచున్న భక్తులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. బుధవారం రద్దీ మరియు ఎండ ఉండటంతో మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. నేడు ఆకరి రోజు కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటే పిల్లలు, వృద్ధులు దర్శనానికి వస్తే ఇబ్బందిపడే అవకాశం ఉంది.
ఈ రోజు అర్థరాత్రి 12 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ నిర్వహిస్తారు. ఈ నెల 6న శోభాయాత్ర, నిమజ్జనం జరగనుంది. నిమజ్జనం కోసం శంషాబాద్ నుండి భారీ క్రేన్ తీసుకువస్తున్నారు. శోభాయాత్రకు ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి శోభాయాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు