ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం పెరగాలి.. మంత్రి దామోదర.
సంగారెడ్డి, 4 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన
మంత్రి దామోదర


సంగారెడ్డి, 4 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించే 500 పడకల కేంద్రాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన

మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న మిగతా మెడికల్ కళాశాలలో అన్ని రకాల వసతులతో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande