సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ను ఆకస్మిక తనిఖీ చేసిన నారాయణపేట కలెక్టర్
నారాయణపేట, 4 సెప్టెంబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మక్తల్ లోని కస్తూర్బా బాలికల విద్యాలయం, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను గురువారం మధ్యాహ్నం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశ
నారాయణపేట కలెక్టర్


నారాయణపేట, 4 సెప్టెంబర్ (హి.స.)

నారాయణపేట జిల్లా మక్తల్ లోని కస్తూర్బా బాలికల విద్యాలయం, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను గురువారం మధ్యాహ్నం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కస్తూర్బా బాలికల గురుకులంలో పిచ్చి మొక్కలను చదును చేసి గార్డెన్ ఏర్పాటు ఎందుకు చేయలేదని కలెక్టర్ నిర్వాహకులను ప్రశ్నించారు.

సరుకులు నిల్వ ఉంచే స్టోర్ రూమ్ లో నిత్యావసర సరుకులు మినహా ఇతర వస్తువులు ఉండరాదని పేర్కొన్నారు. విద్యార్థులను ఆరు బయట కూర్చోబెట్టి బోధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉతికిన విద్యార్థుల దుస్తులను రోడ్లపై ఆరవేయడంపై మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక బోధనకై చొరవ తీసుకొంటామన్నారు. కస్తూరిబా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను నెలలో ఒక్కసారైన స్థానిక తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande