సిద్దిపేట, 4 సెప్టెంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు గురువారం ముట్టడించారు. కాగా పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకుమధ్య తోపులాట చోటు చేసుకుంది. తమకు ఇప్పటికైనా యూరియా అందించాలని రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు