తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
నిర్మల్, 4 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్ నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తారోడకు 3 కి.మీ దూరంలోని మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నాందా గ్రామం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక
రోడ్డు ప్రమాదం


నిర్మల్, 4 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్ నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తారోడకు 3 కి.మీ దూరంలోని మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నాందా గ్రామం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, పక్కన పార్క్ చేసి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే దైవ దర్శనానికి వెళ్లిన కారులోని వాళ్ళు నిజామాబాద్ జిల్లా వర్ని మండలంకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం భైంసా నుంచి నిజామాబాద్ తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande