తిరుపతి, 4 సెప్టెంబర్ (హి.స.)
: తిరుపతి గ్రామీణం పరిధిలోని తుమ్మలగుంటలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంటికి బుధవారం తాళం వేసి ఉండటంతో అధికారులు వెనదిరిగారు. దీంతో గురువారం సోదాలు చేపట్టారు. మద్యం కేసులో 79 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కుంభకోణంలో భాస్కర్‌రెడ్డి ఏ38గా ఉండగా.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి ఏ 39గా ఉన్నారు.
హైదరాబాద్‌లోని భాస్కర్‌రెడ్డి కంపెనీల్లోనూ బుధవారం సిట్ తనిఖీలు చేసింది. మరోవైపు సీబీఆర్ ఇన్‌ఫ్రా పేరుతో చిత్తూరులో ఉన్న వైకాపా నేత విజయానందరెడ్డి ఇంట్లో నిన్న సోదాలు చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన నారాయణ స్వామి ఇంట్లోనూ కొద్ది రోజుల క్రితం అధికారులు తనిఖీలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ