పాడేరు ఐటీడీఏ పీఓ గా 2022 ఐ ఏ ఎస్ బ్యాచ్ కి చెందిన తిరుమణి శ్రీ పూజను ప్రభుత్వం.నియమించింది
పాడేరు, 4 సెప్టెంబర్ (హి.స.) ఐటీడీఏ పీఓగా 2022 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తిరుమణి శ్రీ పూజను ప్రభుత్వం నియమించింది. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామం. ప్రస్తుతం ఎటువంటి పోస్టింగ్‌లో లేకుండా ఉన్నారు. ప్రస్తుతం సంయుక్త కలెక్టర్‌
పాడేరు ఐటీడీఏ పీఓ గా 2022 ఐ ఏ ఎస్ బ్యాచ్ కి చెందిన తిరుమణి శ్రీ పూజను ప్రభుత్వం.నియమించింది


పాడేరు, 4 సెప్టెంబర్ (హి.స.)

ఐటీడీఏ పీఓగా 2022 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తిరుమణి శ్రీ పూజను ప్రభుత్వం నియమించింది. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామం. ప్రస్తుతం ఎటువంటి పోస్టింగ్‌లో లేకుండా ఉన్నారు. ప్రస్తుతం సంయుక్త కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌ పీఓగా ఏడు నెలలుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలోనే పెద్దదిగా ఉన్న పాడేరు ఐటీడీఏకి ఏడు నెలలుగా పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారి లేకపోవడంతో అభివృద్ధి పనులు, ఇతర ప్రగతి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ప్రస్తుతం పూర్తిస్థాయి అధికారి విధుల్లో చేరనుండటంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande