GST శ్లాబుల మార్పుతో స్టాక్ మార్కెట్లలో జోష్.. 380 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్లాబులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులు 5 శాతం, 18 శాతం తీసుకొచ్చ
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)

56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో

స్లాబులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులు 5 శాతం, 18 శాతం తీసుకొచ్చింది. ఈ పరిణామం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఊపును తీసుకొచ్చింది. సెన్సెక్స్ ఏకంగా 387 పాయింట్లు లాభపడింది. ఉదయం 10.30కి సెన్సెక్స్ పుంజుకుని 80,955 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 122 పాయింట్ల ఎగబాకి 24,837 వద్ద స్థిరంగాఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.08గా కొనసాగుతోంది

ఇక నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HUL, గ్రాసిమ్, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, రిలయన్స్, హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. నేడు ఇవాళ ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande