హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో చిన్నా పెద్దా తేడాలేకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఒంటినొప్పులు తదితర ఫ్లూ లక్షణాలతో కూడిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా దవాఖానలతో పాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణం కంటే 50 శాతం వరకు ఓపీ పెరిగినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. చల్లదనం వల్ల ఎక్కువగా ఫ్లూ కేసులు అంటే జలుబు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.శ్రీహర్ష యాదవ్ తెలిపారు. ఇక చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానాలో సైతం ఈ లక్షణాలతో కూడిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు