అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)రైతులు ముసుగులో వైసీపీ కుతంత్రాలను దీటుగా తిప్పి కొట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. క్యాబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేష్ అల్పాహార భేటీ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో తగినంత యూరియా లభ్యత ఉందని మంత్రులు తెలిపారు. 16 వేల పైచిలుకు టీచర్ పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులతో అభినందన సభను పెడితే బాగుంటుందని మంత్రులు సూచించారు.
గతేడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరదపై లోకేష్ చర్చించారు. జగన్ ఐదేళ్ల నిర్వాకంతో బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామని అన్నారు. గతేడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అన్ని శాఖల సమయంతో సవాలను దీటుగా ఎదుర్కొంటున్నామని లోకేష్ అన్నారు. ఇన్చార్జి మంత్రులు నియోజకవర్గాల్లో కార్యకర్తలను కలవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి