, హైదరాబాద్:, 5 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విశేషమైన విరాళాన్ని అందించారు. హైదరాబాద్ తిలక్‌నగర్‌లో 152 గజాల్లో ఉన్న, రూ.4 కోట్ల విలువైన తన మూడంతస్తుల ఇంటిని ఆలయానికి దానం చేశారు. ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పేరు మీద చిక్కడపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత పత్రాల్ని ఆలయ ఈవో వెంకట్రావుకు అందించారు. ఈ సందర్భంగా ఈవో.. దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానించి, ప్రసాదం అందించారు. దాతను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యకార్యదర్శి శైలజా రామాయ్యర్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ