బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఏపీ సర్కారు ఫోకస్
అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.): బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఏపీ సర్కారు ఫోకస్


అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.): బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అమ్మలగన్నయమ్మ.. ఆమహాశక్తి.. విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిదేశం చేశారు.

సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది పదకొండు రోజుల పాటు, అమ్మవారు పదకొండు రకాల శోభాయమాన అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande