ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ శుభాకాంక్షలు
అమరావతి,5 సెప్టెంబర్ (హి.స.) ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు నారా లోకేష్. ‘ఎంతో ఓర్ప
నారా లోకేష్


అమరావతి,5 సెప్టెంబర్ (హి.స.) ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు నారా లోకేష్. ‘ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానం. మన సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువును పూజిస్తాం. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande