నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం జారేడులో ఈ నెల 8 న రైతుల సమావేశం
కందుకూరు, 5 సెప్టెంబర్ (హి.స.) నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. తమ సమస్యలపై చర్చిందుకునేందుకు సమావేశం జరుపుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 2 నుం
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం జారేడులో ఈ నెల 8 న రైతుల సమావేశం


కందుకూరు, 5 సెప్టెంబర్ (హి.స.)

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. తమ సమస్యలపై చర్చిందుకునేందుకు సమావేశం జరుపుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల్లోగా ఈ సమావేశం జరుపుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ప్రశాంత వాతావరణంలో సభ జరిగేలా చర్యలు చేపట్టాలని, అవసరమైతే సభా కార్యక్రమాన్ని వీడియో తీసుకోవచ్చని పోలీసులకు సూచించింది. అదేవిధంగా 14న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ పర్యటనకు కూడా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande