పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎతంటే?
ముంబై, 10 జనవరి (హి.స.) సామాన్య ప్రజలకు బంగారు ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరల కొనుగోలు దారులకు కాస్తా ఊరటనివ్వగా.. తాజాగా శనివారం పెరిగిన ధరలు మళ్లీ షాకిచ్చాయి. భారత్‌పై అమెరికా టారిఫ్‌ విధిస్తామనే
Gold


ముంబై, 10 జనవరి (హి.స.)

సామాన్య ప్రజలకు బంగారు ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరల కొనుగోలు దారులకు కాస్తా ఊరటనివ్వగా.. తాజాగా శనివారం పెరిగిన ధరలు మళ్లీ షాకిచ్చాయి. భారత్‌పై అమెరికా టారిఫ్‌ విధిస్తామనే హెచ్చరికలు, అమెరికా-వెనిజులా ఉద్రిక్తతలు, భౌగోళిక వాణిజ్య అనిశ్చితులు కారణంగానే బంగారం ధరల్లో ఈ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని విష్లేశకులు అంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

మార్కెట్‌ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన తులం బంగారం ధర రూ.1,39,320గా కొనసాగుతుంది. ఈ ధర నిన్న రూ.1,39,310గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,771గా ఉండగా. నిన్న ఈ ధర రూ.1,27,700 వద్ద స్థిరపడింది.

విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,320గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. రూ.1,27,771 వద్ద కొనసాగుతోంది. ఇక వైజాగ్‌లో కూడా ప్రస్తుతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

అటు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,640గా ఉంది. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,010 వద్ద కొనసాగుతుండగా నిన్న ఈ ధర రూ.1,28,000గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ..1,39,320గా వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.రూ.1,27,771 వద్ద కొనసాగుతోంది.

దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,470 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,860గా ఉంది.

ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,320గా వద్ద కొనసాగుతోండగా 22 క్యారెట్ల ధర రూ.1,27,771 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశంలో పాటు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,48,900గా ఉండగా ఈ ధర నిన్న రూ.2,49,000 వద్ద స్థరపడింది హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,67,900గా కొనసాగుతుండగా నిన్న ఈ ధర .2,67,800 వద్ద స్థరపడింది ఇక చెన్నైలో కేజీ వెండి రూ.2,67,900 వద్ద కొనసాగుతోంది బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,48,900 వద్ద కొనసాగుతోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande