
కర్నూలు, 08 జనవరి (హి.స.)
ఏపీ ప్రజలకు అలర్ట్. ఏపీలో సంక్రాంతి పండగ సందర్భంగా అదనంగ మరో రోజు బ్యాంకులు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న బ్యాంకులు ఆర్బీఐ రూల్స్ ప్రకారం బంద్ కానున్నాయి. అయితే..
ఏపీలోని బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 15వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఆర్బీఐ హాలీడేస్ జాబితా ప్రకారం బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే ఆర్బీఐ ప్రకటించిన సెలవుల లిస్ట్‌లో జనవరి 16న ఏపీలో బ్యాంకులకు సెలవు లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులన్నింటికి ఆ రోజున హాలీడే ప్రకటించింది. జనవరి 16న కనుమను రాష్ట్ర ప్రజలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. దీంతో ఆ రోజున బ్యాంకులకు సెలవులు ప్రకటించాలని ఏపీ ప్రభుత్వాన్ని బ్యాంక్ సంఘాలు కోరాయి.
దీంతో బ్యాంక్ సంఘాల వినతితో జనవరి 16న రాష్ట్రంలోని బ్యాంకులకు రాష్ట్ర సర్కార్ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాఎస్ విజయానంద్ సర్క్యూలర్ ఇచ్చారు. మరోవైపు వారంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంక్ సంఘాలు ఈ నెల 27వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.
జనవరి 26న రిపబ్లిక్ డే ఉండటంతో ఆ రోజు బ్యాంకులు బంద్ కానున్నాయి. తర్వాతి రోజు 27న బ్యాంకు సంఘాలు బంద్ వల్ల బ్యాంక్‌లు క్లోజ్ కానున్నాయి. జనవరి 25 ఆదివారం రావడంతో యథావిధిగా బ్యాంక్ కార్యకలాపాలు బంద్ అవుతాయి.
ఈ క్రమంలో జనవరి 25 నుంచి 27 వరకు వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ నెలలో పండుగలు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లు వీటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడాల్సి అవసరం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV