అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ.. LICకి 5.70,000 కోట్ల నష్టం
హైదరాబాద్, 11 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం భారత స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీగా నష్టపోయింది. కేవలం క
War effect


హైదరాబాద్, 11 మార్చి (హి.స.)

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్

మధ్య యుద్ధం భారత స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీగా నష్టపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఎస్ఐసీ ఇన్వెస్ట్ చేసిన షేర్ల విలువ దాదాపు 5.70,000 కోట్లు మేర ఆవిరైపోయింది. అయితే, ఎస్ఐసీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం, ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సెన్ & టూబ్రో (L&T) ລ້ ఈ సంక్షోభంతో అత్యధికంగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై షేర్లను విక్రయించడంతో మార్కెట్ విలువ భారీగా పడిపోయింది.

మార్చి 10 నాటి నివేదిక ప్రకారం.. ఎన్ఐసీకి వివిధ కంపెనీల్లో ఉన్న వాటాల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా బ్లూ-చిప్ కంపెనీల షేర్లు పతనం కావడమే ఈ భారీ నష్టానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావం స్టాక్ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఎస్ఐసీ పోర్ట్ఫోలియో విలువ తగ్గడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande