జీఎస్టీ మ్యాజిక్: కన్స్యూమర్ కంపెనీలకు ఇక లాభాలే
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ తగ్గింపు కారణంగా వినియోగదారుల ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో ముడిసరుకు ఖర్చులు తగ్గడం వంటి అం
జీఎస్టీ


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ

స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ తగ్గింపు కారణంగా వినియోగదారుల ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో ముడిసరుకు ఖర్చులు తగ్గడం వంటి అంశాలు కన్స్యూమర్ స్టేపుల్ (నిత్యవసర వస్తువుల) కంపెనీలకు కలిసొస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఈ కంపెనీల లాభాల మార్జిన్లు గణనీయంగా మెరుగుపడే అవకాశముందని 'సిస్టమాటిక్స్ రీసెర్చ్' . ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు ధరలను తగ్గించాయని, ఫలితంగా వస్తువుల డిమాండ్ పెరిగి అమ్మకాల పరిమాణం పుంజుకుంటుందని నివేదిక అంచనా వేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande