
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ తో సంబంధం
లేకుండా తాను విధులు నిర్వహిస్తానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండింటికి తాను చాలా దూరంగా ఉంటానన్నారు. కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లో ఉన్నవారితో ఎమర్జెన్సీ సమయాల్లో మాట్లాడేందుకే ఫోన్ ఉపయోగిస్తానని తెలిపారు. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఫోన్, ఇంటర్నెట్టే అక్కర్లేదని, అందుకు చాలా మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజలకు తెలియని కొన్ని పద్ధతులను వారికి తెలియ జెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవం వల్ల లాభాలు ఉన్నా.. భద్రతా పరంగా సవాళ్లు కూడా పెరిగాయని, దానిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..