
ఢిల్లీ, 11 జనవరి (హి.స.)ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ (Indian Idol) మూడవ ఎడిషన్ విజేత ప్రశాంత్ తమాంగ్ కన్నుమూశారు. గుండె పోటుతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ మరణాన్ని ఆయన స్నేహితుడు, ఇండియన్ ఐడల్ కో కంటెస్టెంట్ భవేన్ ధనాక్ ధ్రువీకరించారు. అకస్మాత్తుగా ప్రశాంత్ ఈ లోకాన్ని వీడటం తమను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. గుండెపోటుతో ప్రశాంత్ మరణించినట్టు అనుకుంటున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ప్రశాంత్ కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్నారని ఆయన చెప్పారు. ఇండియన్ ఐడల్ సమయంలో తాము రూమ్ మేట్స్‌గా ఉండేవాళ్లమని కూడా వివరించారు. ఇండియన్ ఐడల్ ద్వారా పాప్యులర్ కాకమునుపు ప్రశాంత్ పశ్చిమ బెంగాల్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు