నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అ
నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ’’ ఉందని అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగించిన అంబానీ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థిలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం భారతీయులపై పడలేదని, భారతదేశానికి నరేంద్రమోడీ అజేయమైన రక్షణ గోడ ఉంది’’ అని అన్నారు.

ఈ దశాబ్ధం భారతదేశ భవిష్యత్తును నిర్వచిస్తుందని అన్నారు. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌కు తీసుకురావాలనే ప్రధానమంత్రి దార్శనికతకు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుందని, నరన్‌పురాలోని వీర్ సావర్కర్ మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్వహించడానికి, దానిని జాతీయ- అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, అథ్లెట్ శిక్షణకు కేంద్రంగా మార్చడానికి రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంటుందని ఆయన అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande