
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
ఉత్తరాది రాష్ట్రాలను చలి చంపేస్తోంది. ముఖ్యంగా హిమాలయాల సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. జమ్ము కశ్మీర్ లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. వీధుల్లో, ఇండ్లపైన ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది.
కశ్మీర్ లోయలోని సరస్సులు, చెరువులు, కుంటలలో ఉన్న నీరు గడ్డ కట్టుకుపోయింది. కశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో కూడా చలి తీవ్రతకు నీరు పాక్షికంగా గడ్డకట్టింది. సరస్సు పైభాగంలో చాలావరకు నీరు గడ్డకట్టి మంచు పొర ఏర్పడింది. ఇలాంటి సమయంలో దాల్ సరస్సును వీక్షించడం భక్తులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
దాల్ సరస్సుపై మంచుపొర కప్పిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు