
నాగపూర్, 11 జనవరి (హి.స.)
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలనేదే తన కల అని చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చని రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అంగీకరించారు. అయితే, భారతదేశం ఒక హిందూ దేశమని, ఇక్కడ ఉన్నది హిందూ నాగరికత అని హిమంత స్పష్టం చేశారు. అందుకే భవిష్యత్తులోనూ భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువుగానే ఉంటారని తాము బలంగా నమ్ముతున్నామని, ఈ విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉందని హిమంత తేల్చి చెప్పారు.
కాగా అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన నాగ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ.. హిమంత బిస్వా శర్మ బుర్రలో 'ట్యూబైట్' ఉందంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిని చేపట్టిన వ్యక్తి, అందులో ఎక్కడా లేని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఏ ఒక్క వర్గానికో సొంతం కాదని, కానీ హిమంత మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా సంకుచిత మనస్తత్వం తో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విషయాలను పాకిస్తాన్ రాజ్యాంగంలో మాత్రమే ప్రధాని లేదా అధ్యక్ష పదవులు ఒకే మతానికి చెందిన వారికి పరిమితమని, కానీ మన దేశ గొప్పతనం భిన్నమని ఒవైసీ గుర్తుచేశారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..