
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)సోమనాథ ఆలయం, భారత చరిత్రకు అదుదైన ఒక సాక్ష్యం. కోట్లాది మంది హిందువుల నమ్మకమే ఈ ఆలయాన్ని శతాబ్ధాలుగా నిలబెట్టింది. ఎంతో మంది దేశద్రోహులు దాడులు చేసి, ఆలయాన్ని కొల్లగొట్టి, కూల్చివేసినా.. తట్టుకుని నిలబడింది. సోమనాథ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన పర్వ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగా, 1951లో పూర్తి చేశారు.
గుజరాత్ లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పటాన్ వద్ద, అరేబియా సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. హిందువుల పవిత్ర స్థలాల్లో సోమనాథ్ ఒకటి. ఇక్కడే శివుడు అగ్నిస్తంభంగా అవతరించారని నమ్ముతారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణించబడుతుంది. కపిలి, హిరణి, సరస్వతి నదుల సంగమస్థలమైన త్రివేణీ సంగమం వద్ద ఈ తీర్థక్షేత్రం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు