కేరళలో బీజేపీ సర్కార్ మా అంతిమ లక్ష్యం: అమిత్ షా
తిరువనంతపురం, 11 జనవరి (హి.స.) ఆదివారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేరళలో ''కమలం'' గుర్తు పై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బీజేపీ ముఖ్యమంత్
అమిత్ షా


తిరువనంతపురం, 11 జనవరి (హి.స.)

ఆదివారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేరళలో 'కమలం' గుర్తు పై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బీజేపీ ముఖ్యమంత్రిని పీఠంపై కూర్చోబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ (LDF) 40 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీ సాధించిన చారిత్రక విజయం కేవలం ఒక మైలురాయి మాత్రమేనని, అసలైన గమ్యం రాష్ట్రంలో అధికారంలోకి రావడమేనని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande