
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్ అందించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. కొత్తగా మరో మూడు రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో భాగంగా తమిళనాడు నుంచి కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మూడు రైళ్లు తమిళనాడు నుంచి బయల్దేరి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు వెళతాయి.
ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని వల్ల తమిళనాడు, ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రజలకు లాభం జరగనుంది. ఇప్పటికే సామాన్యుల కోసం దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు