దిగివచ్చిన 'ఎక్స్'.. భారత చట్టాలకు కట్టుబడి ఉంటామని హామీ
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన X లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఎక్స్ ప్లాట్ ఫామ్కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ''ఎక్స్'' (గతంలో ట
ఎక్స్'..


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా

ప్లాట్ ఫామ్ అయిన X లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఎక్స్ ప్లాట్ ఫామ్కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) భారత ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గింది. తమ ప్లాట్ఫామ్లో అశ్లీల కంటెంట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ, ఇకపై భారత చట్టాలకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 3,500 పోస్టులు, లింకులను 'ఎక్స్' ఇప్పటికే బ్లాక్ చేసింది.

అంతేకాకుండా, అశ్లీలతను వ్యాప్తి చేస్తున్న 600కు పైగా ఖాతాలను శాశ్వతంగా తొలగించినట్లు తెలిపింది. ఇకపై తమ వేదికపై ఎలాంటి అశ్లీల చిత్రాలకు, అసభ్యకరమైన కంటెంట్కు అనుమతి ఉండదని 'ఎక్స్' తేల్చిచెప్పింది. ఇటీవల ఏఐ (Al) ద్వారా రూపొందించిన అభ్యంతరకర చిత్రాలు ప్రసారం కావడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్పై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande