
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అన్ని ఏర్పాట్లు పూర్తికాబోతున్నాయని, గద్దెల ప్రాంతంలో చేపట్టిన పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.251 కోట్ల వ్యయంతో పలుఅభివృద్ధి పనులు చేపట్టినట్లు, అవి త్వరితగతిన పూర్తయ్యేలా రాష్ట్ర మంత్రులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..