
విజయవాడ, 13 జనవరి (హి.స.)
: మద్యం మత్తులో బబ్బూరి గ్రౌండ్స్ వద్ద కారును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన పాత నేరస్థులు, రౌడీ షీటర్లు.. కొండా యోహావా అలియాస్ పెద్ద చిచ్చా, కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా, వీర్ల భార్గవ్‌లను అదుపులోకి తీసుకున్నామని నగర ఏడీసీపీ రామకృష్ణ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు.
పెద్ద చిచ్చాపై 18 కేసులు, చిన్న చిచ్చాపై 42 కేసులు ఉన్నాయన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిపేరు నిమిత్తం షెడ్డుకు వచ్చిన కారును వీరు.. జల్సాలకు వాడారన్నారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని ఏడీసీపీ తెలిపారు. ఆదివారం సాయంత్రం రౌడీషీటర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పఠాన్ రిహాన్‌ఖాన్(10), మీడియా విలేకరి నాగేంద్ర, మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ