స్వగ్రామం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు
తిరుపతి, 13 జనవరి (హి.స.) , సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా రంగంపేట - భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డును సీఎం ప్
స్వగ్రామం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు


తిరుపతి, 13 జనవరి (హి.స.)

, సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా రంగంపేట - భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డును సీఎం ప్రారంభించారు. అలాగే చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు.. తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కల్యాణ్‌ డ్యామ్‌కు కృష్ణా జలాలను తీసుకురావడానికి రూ.126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande