
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
నగర పరిధిలో మాదకద్రవ్యాలపై సర్కార్ ఉక్కుపాదం మొపినప్పటికీ.. అక్రమార్కుల దందాకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా నేడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని టోల్గేట్ సమీపంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కారులో అక్రమంగా తరలిసున్న 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు