
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
ట్రాన్స్ జెండర్ల విషయంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ను కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచించారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం 'బాల భరోసా', 'ప్రణామ్' డే కేర్ సెంటర్లను ప్రజాభవన్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక విషయాలు ప్రస్తావించారు. ట్రాన్స్ జెండర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు