
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో, రోహిత్ శర్మ ర్యాంకు పడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మను దాటుకొని విరాట్ కోహ్లి మొదటి స్థానానికి వెళ్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లి రెండవ స్థానంలో ఉన్నాడు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లి ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి. నిన్న న్యూజిలాండ్ పైన రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. కానీ విరాట్ కోహ్లి మాత్రం 93 పరుగులు సాధించాడు. బుధవారం రోజున ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..