
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
గతంలో కానీ భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం అదిలాబాద్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి భారత రాష్ట్ర సమితి వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..