
ఖమ్మం, 12 జనవరి (హి.స.) సమాజ స్పృహ పెంచే ముగ్గులు
వేయడం అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని సూర్యనగర్ కాలనీకి చెందిన పదోతరగతి చదువుతున్న దరణి దీక్షిత అనే విద్యార్థిని తల్లిగర్భంలో ఉన్నప్పుడు శిశువు దశల ఆలోచనాత్మకమైన ముగ్గును వేసింది. ముగ్గును పరిశీలించిన మంత్రి పొంగులేటి చిన్నవయస్సులోనే సమాజాన్ని మెలుకొలిపే ముగ్గులు వేయడం అభినందనీయమని చిన్నారని మంత్రి పొంగులేటి దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. ప
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు