మేడారం మహాజాతరకు పటిష్ట బందోబస్తు కోరిన మంత్రి సీతక్క
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) మేడారం మహా జాతర సందర్భంగా రెండు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం అదనపు పోలీస్ సిబ్బందిని నియమించాలని మంత్రి సీతక్క రాష్ట్ర డీజీపీని కోరారు. సోమవారం హైదరాబాదులో డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఎమ్మెల్య
మంత్రి సీతక్క


హైదరాబాద్, 12 జనవరి (హి.స.)

మేడారం మహా జాతర సందర్భంగా రెండు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం అదనపు పోలీస్ సిబ్బందిని నియమించాలని మంత్రి సీతక్క రాష్ట్ర డీజీపీని కోరారు. సోమవారం హైదరాబాదులో డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణతో కలిసి మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహా జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. మంత్రి విన్నపానికి డీజీపీ సానుకూలంగా స్పందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande