
వనపర్తి, 12 జనవరి (హి.స.)
యాసంగిలో సాగుచేసిన
పంటలకు యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్ లో ఉంచిన సంఘటన వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. యాసంగిలో సాగుచేసిన పంటలకు యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు సరిపడిన యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు. నేడు యూరియా బస్తాలు రావడంతో విషయం తెలుసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకొని చెప్పులు క్యూలైన్ లో పెట్టి పడిగాపులు కాశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు