తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: టీపీసీసీ చీఫ్
నిజామాబాద్, 12 జనవరి (హి.స.) రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
టీపీసీసీ చీఫ్


నిజామాబాద్, 12 జనవరి (హి.స.)

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలను జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ను గెలుచుకుని కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande