బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కా
మంత్రి కిషన్ రెడ్డి


హైదరాబాద్, 12 జనవరి (హి.స.)

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని తీసేశామనేది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

దేశంలో మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక వ్యవస్థాగత మార్పులు, సంస్కరణలు చేపడుతోందని కిషన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande