సంక్రాంతి.కి.ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు
ఏలూరు, 13 జనవరి (హి.స.) , :సంక్రాంతి పండుగకు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి- కాకినాడ (07480) టౌన్ రైలును ఈ నెల19వ తేదీన నడపనున్నారు. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలక
సంక్రాంతి.కి.ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు


ఏలూరు, 13 జనవరి (హి.స.)

, :సంక్రాంతి పండుగకు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి- కాకినాడ (07480) టౌన్ రైలును ఈ నెల19వ తేదీన నడపనున్నారు. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - చర్లపల్లి (07481) రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 11:15 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్ళు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande