
అమరావతి, 13 జనవరి (హి.స.)కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ