
అమరావతి, 13 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు నారావారి పల్లెలో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.140 కోట్లతో శంకుస్థాపనలు, రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను చంద్రగిరి ప్రాంతానికి తరలించడంతో కోసం మూలపల్లి చెరువు వద్ద రూ.126 కోట్ల ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో రంగంపేట- భీమవరం రోడ్ నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
అలాగే, నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు. సంజీవని ప్రాజెక్టులకు శుభారంభం చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ