మంత్రి వెంకటస్వామికి రైతుల నుండి నిరసన సెగ
సిద్దిపేట, 13 జనవరి (హి.స.) అయ్యా మంత్రి రెండు లక్షల రుణమాఫీ ఎటు పోయే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అంటూ.. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలోని రైతులు ప్లా కార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నా
మంత్రి వెంకటస్వామి


సిద్దిపేట, 13 జనవరి (హి.స.)

అయ్యా మంత్రి రెండు లక్షల రుణమాఫీ ఎటు పోయే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అంటూ.. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలోని రైతులు ప్లా కార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రాగా, ధర్మాజీపేట రైతులు నిలదీశారు. ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా, రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande