
మహబూబ్ నగర్ , 13 జనవరి (హి.స.)
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్
మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారి పై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందగా.. భర్త, మరో కూతురికి తీవ్ర
గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లాకు చెందిన తిరుపతి, తన భార్య నాగమణి (30), కూతుళ్లు
ప్రియాన్షి, యాసిని (3) తో కలిసి హైదరాబాద్ నుండి మోటార్ సైకిల్ పై తమ సొంత ఊరుకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న మోటార్ సైకిల్ భూత్పూర్ మండల సమీపంలోని.. గాజులపేట వద్ద జాతీయ రహదారిపై
అదుపుతప్ప డివైడర్ను ఢీకొట్టింది.ఈ సంఘటనలో నాగమణి అక్కడికి అక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ తిరుపతి, వారి ఇద్దరి కూతుర్లను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాసినిమరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు