మహిళా ఐఏఎస్ పై ఆరోపణల కేసు.. సిట్ ఏర్పాటు చేసిన డీజీపీ
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ను కించపరిచే కథనాల కేసుల్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ ను కించపరిచేలా వార్తా కథనాలు ప్రచారం చేశారని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇ
మహిళా ఐఏఎస్ పై


హైదరాబాద్, 13 జనవరి (హి.స.)

లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ను కించపరిచే కథనాల కేసుల్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ ను కించపరిచేలా వార్తా కథనాలు ప్రచారం చేశారని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీబీ అరవింద బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐ హరీశ్ ఉన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande