వీధికుక్కల కేసుపై సుప్రీం సీరియస్: రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ, 13 జనవరి (హి.స.) వీధికుక్కల కేసుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేసిన కోర్టు.. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోని రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రతీ కుక్కకాటుకు పర
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 13 జనవరి (హి.స.) వీధికుక్కల కేసుపై సుప్రీంకోర్టు

మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేసిన కోర్టు.. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోని రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రతీ కుక్కకాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. గత ఐదేళ్లుగా వీధి జంతువుల నియంత్రణకు సంబంధించి నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదే సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేవలం ప్రభుత్వాలకే కాకుండా, వీధి కుక్కలకు ఆహారం పెట్టే డాగ్ లవర్స్, ఫీడర్స్ కూడా కుక్కల కాట్ల ఘటనలకు బాధ్యులు, జవాబుదారులుగా పరిగణిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande