
హైదరాబాద్, 13 జనవరి (హి.స.)
ట్రాఫిక్ చలాన్లు పడగానే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్ లేదని మాట మారుస్తోందని దుయ్యబట్టారు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నారని, ఇతర హామీల మాదిరిగా ట్రాఫిక్ చలాన్లపై మాట మార్చడమేనని ద్వజమెత్తారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా బండి సంజయ్ పోస్టు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..