హైదరాబాద్–విజయవాడ హైవేపై లారీ బోల్తా.. 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. లారీ రోడ్డుకు అడ్డంగా ప
లారీ బోల్తా


హైదరాబాద్, 13 జనవరి (హి.స.)

హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పాటు కట్టెలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఈ ప్రమాదం కారణంగా ఇమామ్‌గూడ నుంచి ఓఆర్ఆర్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande