
యాదాద్రి భువనగిరి, 13 జనవరి (హి.స.)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూతులో ప్రాథమిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వెంటిలేషన్ కోసం కిటికీలు, తలుపులు, మరుగుదొడ్ల వసతి, ర్యాంపు వంటి అన్ని రకాల వసతులు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వహించాలని..సెలవులు పెట్టకూడదని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు