
కడప, 13 జనవరి (హి.స.)
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అగ్నిప్రమాదంచోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్లో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి అనుబంధంగా దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక పూజా సామాగ్రి దుకాణం కూడా ఉంది. సోమవారం రాత్రి సమయంలో దుకాణంలో నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. కొద్దిసేపటికి మంటలు అంటుకొని వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు దుకాణ యజమానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV